తమను అధికారులు మోసం చేస్తున్నారని కృష్ణా జిల్లా డీలర్ల సంఘం అధ్యక్షుడు ముత్యాల శేషగిరిరావు ఆరోపించారు. గోనె సంచుల విషయంలో అధికారులు ఇచ్చిన ఉత్తర్వులను ఖండిస్తున్నామని తెలిపారు. ఈ మేరకు జగ్గయ్యపేట చౌక సరకుల గోదాము ఎదుట ఆందోళన నిర్వహించారు. జీఓ 10ని రద్దు చేసే వరకూ విధులు నిర్వహించలేమని స్పష్టం చేశారు. ఇంటింటికీ రేషన్ సరకులు సరఫరా చేయాలన్న నిర్ణయం నష్టం చేకూరుస్తుందని.. అయినా ఆశయం నచ్చి స్వాగతించామని పేర్కొన్నారు.
జగ్గయ్యపేటలో రేషన్ డీలర్ల ఆందోళన
కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో రేషన్ డీలర్లు ఆందోళనకు దిగారు. గోనెసంచులపై అధికారులు ఇచ్చిన ఉత్తర్వులను ఖండించారు. తమ ప్రయోజనాలు తిరిగి పునరుద్ధరించే వరకు విధుల్లో పాల్గొనేది లేదని స్పష్టం చేశారు.
సివిల్ సప్లై డీలర్ల ఆందోళన