ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వినియోగదారుడి క్షేమమే... నా లాభం - ఐదు కేజీల మటన్​ కొన్నవారికి హెల్మెట్ ఉచితం తాజా వార్తలు

వ్యాపారాల్లో లాభాలు గడించేందుకు ఒక్కొక్కరు ఒక్కో మార్గం ఎంచుకుంటారు. అయితే కృష్ణాజిల్లా నందిగామకు చెందిన వెంకటేశ్వరరావు మాత్రం వినియోగదారుడి క్షేమమే తన లాభం అంటున్నాడు. ఇంతకీ ఆ కథేంటో మనము తెలుసుకుందాం పదండి..

buy five kg of mutton Helmet free
నందిగామలో ఐదు కేజీల మటన్​ కొన్నవారికి హెల్మెట్ ఉచితం

By

Published : Feb 16, 2020, 4:28 PM IST

నందిగామలో ఐదు కేజీల మటన్​ కొన్నవారికి హెల్మెట్ ఉచితం

వినియోగదారుడి క్షేమమే తన లాభమంటూ.. ఓ మటన్ వ్యాపారి వినూత్న పద్ధతిలో అందరిని ఆకర్షిస్తున్నాడు. కృష్ణాజిల్లా నందిగామకు చెందిన వెంకటేశ్వరరావు అనే మటన్ వ్యాపారి కొత్త తరహాగా ఆలోచించి హెల్మెట్​లను పంపిణీ చేస్తున్నాడు. ఐదు కేజీల మటన్​ కొన్నవారికి హెల్మెట్ ఉచితంగా ఇస్తున్నాడు. కేజీ మటన్ ఆరు వందల రూపాయలు కాగా.. ఐదు కేజీలు కొన్న వారికి అంతే విలువజేసే హెల్మెట్​ను ఉచితంగా ఇస్తున్నాడు. అయితే వినియోగదారుడు క్షేమంగా ఉంటే తన వ్యాపారం అభివృద్ధి చెందుతుంది అంటున్నాడు. అంతేకాదండీ.. ప్లాస్టిక్​ వాడకుండా ఇంటి దగ్గర నుంచి స్టీల్​ బాక్స్​ తెచ్చుకుంటే వినియోగదారుడికి రూ. 20 కూడా తగ్గిస్తున్నాడు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details