ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'అసంఘటిత కార్మికులను ప్రభుత్వమే ఆదుకోవాలి'

ప్రజలకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న సాయాన్ని... వైకాపా ప్రభుత్వం తమ సాయంగా చెప్పుకుంటోందని తెదేపా నేత బొండా ఉమా ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అవినీతి విధానాలపై రాజ్యాంగ సంస్థలు జోక్యం చేసుకోవాలని కోరారు.

bonda uma
బోండా ఉమా

By

Published : Jul 16, 2020, 3:50 PM IST

కరోనా సమయంలో ఆర్థికంగా దెబ్బతిన్న అసంఘటిత కార్మికులను ఆదుకోవాలని విజయావడలో తెదేపా శ్రేణులు నిరసన దీక్షలు చేపట్టారు. సీనియర్ నాయకుడు బొండా ఉమామహేశ్వరావు దీక్షలో పాల్గొని సంఘీభావం తెలిపారు. కరోనా సమయంలో వైకాపా ప్రభుత్వం రాష్ట్రంలో ఒక్క కుటుంబాన్ని కూడా ఆదుకోలేదన్నారు.

కేవలం కేంద్ర ప్రభుత్వం చేసిన సాయాన్ని తమ సాయంగా చెప్పుకొని వైకాపా ప్రభుత్వం కాలం వెళ్లదీస్తోందని ఆరోపించారు. రాష్ట్రం నుంచి పొరుగు రాష్ట్రానికి అక్రమంగా తరలిస్తూ భారీగా పట్టుబడిన నగదుపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. వైకాపా ప్రభుత్వం చేస్తున్న అవినీతి పరిపాలన విధానాలపై రాజ్యాంగ సంస్థలు విచారణ చేయాలని విజ్ఞప్తి చేశారు.

ABOUT THE AUTHOR

...view details