కృష్ణా జిల్లా పెనమలూరులో ప్రధాన పార్టీల ప్రచారం జోరుగా సాగుతోంది. మచిలీపట్నం వైకాపా ఎంపీ అభ్యర్థి బాలశౌరి నియోజకవర్గంలో విస్తృత ప్రచారం నిర్వహించారు.
బాలశౌరి ఎన్నికల ప్రచారం
By
Published : Apr 4, 2019, 6:39 PM IST
బాలశౌరి ఎన్నికల ప్రచారం
కృష్ణా జిల్లా పెనమలూరులో ప్రధాన పార్టీల ప్రచారం జోరుగా సాగుతోంది. మచిలీపట్నం వైకాపా ఎంపీ అభ్యర్థి బాలశౌరి నియోజకవర్గంలో విస్తృత ప్రచారం నిర్వహించారు. పెనమలూరు ఎమ్మెల్యే అభ్యర్థి కొలుసు పార్థసారథితో కలిసి ఇంటింటి ప్రచారం చేశారు. ప్రధాన రహదారుల వెంట తిరుగుతూ నవరత్నాల గురించి ప్రజలకు వివరిస్తూ కరపత్రాలు అందజేశారు. తెదేపా ప్రవేశపెట్టిన పసుపు-కుంకుమ, అన్నదాత సుఖీభవపథకాలు ఓట్ల కోసం పెట్టినవని విమర్శించారు. ఫ్యాన్ గుర్తుకు ఓటువేసి రాష్ట్రాభివృద్ధికి సహకరించాలని కోరారు.