ఆశా కార్యకర్తలను సచివాలయాలకే పరిమితం చేసే పద్ధతిని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని... కృష్ణా జిల్లా మైలవరంలోని ఎంపీడీఓ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. సీఐటీయూ మండల కార్యదర్శి చాట్ల సుధాకర్ ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. పాత పద్దతిలోనే ప్రతి 1000 మంది జనాభాకి ఒక ఆశా కార్యకర్తని కొనసాగించాలని విన్నవించుకున్నారు. నిరంతరం ప్రజా ఆరోగ్యం కోసం శ్రమించే ఆశా కార్యకర్తలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
'మమ్మల్ని సచివాలయాలకే పరిమితం చేయకండి' - latest updates in vijayawada
ప్రజలకు ఆరోగ్య సేవలు అందించే తమను సచివాలయాలకే పరిమితం చేసే పద్ధతిని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని ఆశా కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. పాత పద్దతిలో 1000 మంది జనాభాకి ఒక ఆశా కార్యకర్తని కొనసాగించాలని విన్నవించుకున్నారు.

ఆశా కార్యకర్తల నిరసన