ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పెంచిన హరితపన్ను వసూలు నిలిపివేయండి.. సీఎంకు లారీ యజమానుల సంఘం లేఖ

Letter to CM Jagan: సీఎం జగన్​కు లారీ యజమానుల సంఘం లేఖ రాసింది. కొవిడ్ ఇబ్బందుల దృష్ట్యా హరిత పన్నుపై పునరాలోచన చేయాలని విజ్ఞప్తి చేసింది. తీవ్ర ఆర్థిక సంక్షోభంతో ఫైనాన్స్ కిస్తీలు కట్టలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని గుంతలమయమైన రోడ్లను అభివృద్ధి చేయాలని కోరారు.

ap lorry owners association
ap lorry owners association letter to cm jagan

By

Published : Jan 17, 2022, 12:14 PM IST

lorry owners association letter to cm Jagan: కొవిడ్​తో తాము తీవ్ర కష్టాలు పడుతున్నందున రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల నుంచి పెంచిన హరిత పన్ను వసూలును వెంటనే నిలిపివేయాలని లారీ యజమానులు.. రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్​కు లారీ ఒనర్స్ అసోషియేషన్ లేఖ రాసింది. కొవిడ్ కారణంగా రాష్ట్రంలో రవాణా రంగం తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని లారీ యజమానులు.. సీఎం దృష్టికి తెచ్చారు. తీవ్ర మందగమనం ఉన్నందున రోజు వారి ఖర్చులను నిర్వహించడమూ కష్టమవుతోందని తెలిపారు. ఫైనాన్స్ కిస్తీలు కట్టలేకపోవడంతో వేల లారీలను ఫైనాన్స్ వారు స్వాధీనం చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ పరిస్థితుల్లో దేశంలో ఎక్కడా లేని రీతిలో రాష్ట్ర ప్రభుత్వం హరిత పన్ను పెంచిందని పేర్కొన్నారు. వాహనాలను బట్టి 200 రూపాయల నుంచి 20 వేలకు పన్నులు వసూలు చేస్తున్నారని లేఖలో ప్రస్తావించారు. హరిత పన్ను పెంపు వల్ల లారీ యజమానులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని తెలిపారు. వెంటనే హరిత పన్ను వసూలును నిలుపుదల చేయాలని కోరారు.

రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ధరలు సరిహద్దు రాష్ట్రాల కంటే ఎక్కువగా ఉన్నాయన్న లారీ యజమానులు లేఖలో వెల్లడించారు. భారంగా మారినందున వెంటనే డీజిల్ పై పన్నులు తగ్గించాలని కోరారు. రోడ్లు దారుణంగా దెబ్బతినడం వల్ల రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయని, గుంతలమయమైన రహదారులపై నెమ్మదిగా వెళ్లాల్సి రావడం వల్ల డీజిల్ వినియోగం పెరిగి లారీ యజమానులు నష్టపోతున్నారని లేఖలో సీఎంకు తెలిపారు. రాష్ట్రంలో అన్ని రాష్ట్ర, జిల్లా రహదారులను వెంటనే మరమ్మతులు చేయాలని లారీ యజమానుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈశ్వరరావు ముఖ్యమంత్రి జగన్​కు విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి

CM Jagan Review: కొవిడ్, వైద్య ఆరోగ్యశాఖపై నేడు సీఎం జగన్ సమీక్ష

ABOUT THE AUTHOR

...view details