ఆగస్టు 26, 29,30, సెప్టెంబర్ 1.... ఆ వారం రోజులు రాష్ట్రంలో పరీక్షల హడావుడి నెలకొనబోతోంది. గ్రూప్-3 ప్రధాన పరీక్షను ఆగస్టు 26న నిర్వహించేందుకు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రంగం సిద్ధం చేసింది. 1051 పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీ కోసం 14వేల 175మంది అభ్యర్థులు పరీక్ష రాయబోతున్నారు. అంతేకాకుండా 447 గ్రూప్-2 పోస్టుల భర్తీ కోసం 6వేల 195 మంది అభ్యర్థులు ప్రధాన పరీక్ష రాయనున్నారు. ఆగస్టు 29, 30 తేదీల్లో గ్రూప్-2కు సంబంధించిన ప్రధాన పరీక్షలు జరగనున్నాయి. తర్వాత రెండు రోజులకే రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల నియామక పరీక్ష నిర్వహించనున్నారు.
సహజంగా ప్రభుత్వ కొలువులకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసిన నాటినుంచి పరీక్ష నిర్వహించడానికి కనీసం 45 రోజులు వ్యవధి ఉండడం ఆనవాయితీగా వస్తోంది. గ్రామ, వార్డు సచివాలయాల విషయంలో ముందుగా నిర్ణయించిన తేదీ ప్రకారం గాంధీ జయంతి నాటికి...గ్రామ, వార్డు కార్యదర్శులు విధుల్లోకి చేరాలనే ఉద్దేశంతో తక్కువ వ్యవధిలోనే పరీక్ష నిర్వహిస్తున్నారు. గ్రూప్స్‌కు సంబంధించి కోచింగ్ తీసుకుంటున్న అభ్యర్థులతోపాటు ఇతర నిరుద్యోగులు సైతం ఈ గ్రామ, వార్డు సచివాలయాలపై దృష్టి కేంద్రీకరిస్తున్నారు.