కృష్ణాజిల్లా నందిగామ పోలీసు ప్రత్యేక బృందం ఎస్సై జేవి. రమణ, సాండ్ మొబైల్ టీం సిబ్బందితో కలసి అర్ధరాత్రి 12:30 గంటల సమయంలో అక్రమంగా తరలిస్తున్న 110 మద్యం బాటిళ్లను పట్టుకున్నారు. తెలంగాణ రాష్ట్రం బోనకల్లు రహదారి గుండా జిల్లాకు మద్యం తరలిస్తున్న ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకుని.. ఒక వ్యక్తి అరెస్టు చేశారు. నిందితున్ని వత్సవాయి పోలీస్ స్టేషన్ల్లో అప్పజెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
అర్ధరాత్రి వేళ మద్యం తరలింపు..పట్టుకున్న పోలీసులు - కృష్ణాజిల్లా నందిగామ పోలీసు ప్రత్యేక బృందం ఎస్సై జేవి. రమణ
మద్యం దొంగలు రూటు మార్చారు. పగటి పూట మద్యం బాటిళ్లను తరలిస్తుంటే పోలీసులు పట్టుకుంటున్నారని అర్ధరాత్రి దాటాకా మద్యాన్ని తరలిస్తున్నారు. అర్ధరాత్రి వేళ గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తున్న 110 మద్యం బాటిళ్లను కృష్ణాజిల్లా నందిగామ పోలీసు ప్రత్యేక బృందం స్వాధీనం చేసుకుంది.

అర్ధరాత్రి వేళ మద్యం..గుట్టుచప్పుడు కాకుండా పట్టుకున్న పోలీసులు