ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భార్యను చంపిన భర్త..అనాథలైన పసిపిల్లలు - vijayawada

భార్యపై అనుమానంతో భర్త బండరాయితో మోది చంపిన ఘటన విజయవాడలో సంచలనం సృష్టించింది. తల్లి చనిపోయిన విషయం తెలియని పిల్లలు అమాయకంగా చూస్తుండటం స్థానికులను కంటతడిపెట్టింది.

a man killed his wife at ramanagaram in vijayawada, krishna district

By

Published : Aug 31, 2019, 12:23 PM IST

భార్యను బండరాయితో మోదిచంపిన భర్త..

కంటికిరెప్పలాగా చూసుకోవాల్సిన భర్తే ఆమెని కడతేర్చాడు.విజయవాడ నిడమనూరు రామానగరంలో చోటుచేసుకున్న ఈ ఘటనలో భార్యను బండరాయితో మోది హత్య చేశాడు భర్త.కృష్ణా జిల్లా పామర్రుకు చెందిన గంట శామ్యూల్ వృత్తిరిత్యా లారీ డ్రైవర్.ఇటీవల భార్య అశ్విని ప్రవర్తనపై అనుమానంతో కొంత కాలంగా ఘర్షణ పడుతూన్నాడు.ఈ సమయంలో గత రాత్రి భార్య,తన ఇద్దరు పిల్లలతో ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో,డ్యూటీకి నుండి వచ్చిన శామ్యూల్ బండరాయితో కొట్టి భార్యను కిరాతకంగా చంపాడు.అనంతరం పటమట పోలీసులకు లొంగిపోయాడు.మృతురాలి ఇద్దరు పిల్లలు అమ్మకి ఏం జరిగిందో,తెలియక అమాయకంగా చూస్తుండటం స్ధానికులకు కంటతడిపెట్టిస్తోంది.

ABOUT THE AUTHOR

...view details