SP: అమలాపురంతో సహా కోనసీమ వ్యాప్తంగా ప్రశాంత వాతావరణం నెలకొందని కోనసీమ జిల్లా ఎస్పీ సుబ్బారెడ్డి వెల్లడించారు. అమలాపురంలో 144సెక్షన్, పోలీస్ చట్టం 30 అమలులో ఉందని వెల్లడించారు. ఎటువంటి ధర్నాలు, నిరసనలు, రాస్తారోకోలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కొందరు బాధ్యతారాహిత్యంతో రెచ్చగొట్టే పోస్టులు పెడుతున్నారని.. అందుకే ఇంటర్‌నెట్ సేవలు నిలిపేశామని.. త్వరలో పునరుద్ధరిస్తామని స్పష్టం చేశారు. ప్రజలు లేనిపోని పుకార్లను నమ్మవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.
అమలాపురంలో ఇంకా.. ఆ సెక్షన్లు అమల్లోనే ఉన్నాయి : ఎస్పీ సుబ్బారెడ్డి
SP: అమలాపురంతో సహా కోనసీమ వ్యాప్తంగా ప్రశాంత వాతావరణం నెలకొందని కోనసీమ జిల్లా ఎస్పీ సుబ్బారెడ్డి వెల్లడించారు. అమలాపురంలో 144సెక్షన్, పోలీస్ చట్టం 30 ఇంకా.. అమలులోనే ఉన్నాయని వెల్లడించారు. ధర్నాలు, నిరసనలు, రాస్తారోకోలకు అనుమతి లేదని స్పష్టం చేశారు.
అమలాపురంలో 144సెక్షన్, పోలీస్ చట్టం 30 అమలులో ఉంది
స్పందనకు భారీ బందోబస్తు:కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో ఈ నెల 24న చోటు చేసుకున్న విధ్వంసం అనంతరం ఈరోజు కలెక్టరేట్లో నిర్వహిస్తున్న స్పందనకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేయడానికి వస్తున్న వారిని పోలీసులు తనిఖీ చేసి లోపలకు పంపుతున్నారు.
ఇవీ చదవండి: