Good news for priests: వివిధ దేవాలయాల్లో పనిచేస్తున్న అర్చకులు, వారి కుటుంబ సభ్యులకు ఇకపై వంద శాతం వైద్య ఖర్చుల తిరిగి చెల్లింపులు చేస్తామని దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ వెల్లడించారు. ప్యానల్ డాక్టర్ నిబంధనలు మేరకు సూచించిన మొత్తం ఖర్చును చెల్లించే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేశారు. అర్చకుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. దీనిని తక్షణమే అమలులోకి తీసుకువచ్చేలా అధికారులను ఉప ముఖ్యమంత్రి, దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ఆదేశించారు. ఇటీవల ప్రారంభించిన అర్చక, ఇతర ఉద్యోగుల సంక్షేమ నిధి ఆన్లైన్ వెబ్సైట్ www.aparchakawelfare.org
ద్వారా అర్జీలు నమోదు చేసుకోవచ్చునని మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్లోని అర్చకులకు శుభవార్త.. ఏంటంటే..! - మంత్రి కొట్టు సత్యనారాయణ
Good news for priests: దేవాలయాల్లోని అర్చకులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధిలోని వివిధ దేవాలయాల్లో పనిచేస్తున్న అర్చకులు, వారి కుటుంబ సభ్యులకు ఇకపై వంద శాతం వైద్య ఖర్చుల తిరిగి చెల్లింపుల్లిస్తామని దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ వెల్లడించారు. అర్చకుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.

అర్చకులు