జడ్పీ పాలకవర్గానికి ఐదేళ్ల పదవీకాలం ముగిసినందున గుంటూరులో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. జడ్పీ ఛైర్ పర్సన్ షేక్ జానీమూన్ అధ్యక్షతన జరిగిన చివరి సమావేశానికి జడ్పీటీసీలు హాజరయ్యారు. ఆఖరి సమావేశంలో జడ్పీటీసీ సభ్యులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. నిధులు, విధులు లేకుండానే తమ 5 ఏళ్ల పదవీకాలం ముగిసిపోయిందని వాపోయారు. పంచాయతీరాజ్ 5 అంచెల వ్యవస్థ పూర్తిగా విఫలమైందని.. జడ్పీటీసీలు ఆరో వేలుగా మిగిలిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త ప్రభుత్వంలోనైనా జడ్పీటీసీలకు సముచిత ప్రాధాన్యత కల్పించాలని సభ్యులు కోరారు.
జడ్పీ కార్యాలయంలో ఆత్మీయ సమావేశం
గుంటూరులో జడ్పీ ఛైర్ పర్సన్ షేక్ జానీమూన్ అధ్యక్షతన ఆత్మీయ సమావేశం నిర్వహించారు. జడ్పీ పాలకవర్గానికి ఐదేళ్ల పదవీకాలం ముగిసినందున సభ్యులు తమ ఆవేదన వ్యక్తం చేశారు.
గుంటూరు జడ్పీ కార్యాలయంలో ఆత్మీయ సమావేశం