YSRCP SOCIAL MEDIA ACTIVISTS HULCHAL : గుంటూరు జిల్లా మంగళగిరి గ్రామీణ పోలీస్‌స్టేషన్‌లో వైకాపా సోషల్ మీడియా నేతలు వీరంగం సృష్టించారు. మా పార్టీ కార్యకర్తలనే కొడతారా అంటూ.. స్టేషన్‌లో హల్‌చల్ చేశారు. వైకాపాకు చెందిన నేతలు తప్పు చేస్తే కేసులు పెట్టాలి కానీ కొడతారా అంటూ పోలీసులను నిలదీశారు. వీరితో పాటు ఓ మీడియా ప్రతినిధి కూడా పోలీసులపై రెచ్చిపోయారు. పోలీస్ స్టేషన్‌లో పెద్దగా కేకలు వేస్తూ హంగామా చేస్తున్నా.. పోలీసులు సున్నితంగా సముదాయించడం తప్ప ఏమీ చేయలేకపోయారు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
మేం! వైకాపా సోషల్ మీడియా వాళ్లం, మా వాళ్లనే కొడతారా.. పోలీసులతో గొడవ
YCP LEADERS HULCHAL : మంగళగిరి పోలీస్‌స్టేషన్‌లో వైకాపా సోషల్ మీడియా నేతలు హల్చల్ చేశారు. తప్పు చేస్తే కేసులు పెట్టాలి కానీ.. మా పార్డీ నేతలనే కొడతారా అంటూ రెచ్చిపోయారు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరలయ్యాయి.
గురువారం అర్ధరాత్రి గస్తీలో ఉన్న మంగళగిరి గ్రామీణ ఎస్‌ఐ విజయకుమార్‌రెడ్డి.. తాడేపల్లి మండలం ప్రకాశ్‌నగర్‌లో వైకాపా కార్యాలయం వద్ద కారకర్తలు ఉండటాన్ని గమనించారు. ఈ వేళలో ఏం పని అంటూ అందరినీ అక్కడి నుంచి పంపించబోయారు. అధికార పార్టీ నేతలనే బెదిరిస్తావా అంటూ వారు రెచ్చిపోవడంతో.. ఎస్‌ఐ వారిని గట్టిగా హెచ్చరించారు. ఉదయం పోలీస్‌స్టేషన్‌కు వచ్చి మాట్లాడాలని చెప్పి వెళ్లిపోయారు. శుక్రవారం ఉదయం పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన వైకాపా సోషల్ మీడియా విభాగం నేతలు.. బీభత్సం సృష్టించారు. పోలీసులు వారి వద్ద గంజాయి దొరికిందని వెల్లడించారు. గంజాయి ఉంటే కేసులు పెట్టాలంటూ.. వైకాపా నేతలు గట్టిగా కేకలు వేశారు. సీఐ వచ్చి సోషల్ మీడియా నేతలతో మాట్లాడి.. రాజీ కుదిర్చినట్లు తెలిసింది.
ఇవీ చదవండి: