గ్రామ సచివాలయ ఉద్యోగాల నియామకంలో అవకతవకలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒక్క పరీక్ష 100 సందేహాలు రేపుతోందని పేర్కొన్నారు. 5 లక్షల రూపాయలకు ప్రశ్న పత్రాలను బేరం పెట్టారని సర్వత్రా ఆరోపణలు వస్తున్నాయన్న కాల్వ.... పరీక్ష ఎవరు నిర్వహించారో ఇంతవరకు చెప్పలేని పరిస్థితి నెలకొందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మెరిట్ లిస్ట్ ఇంతవరకు ఎందుకు ప్రకటించలేదో చెప్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అధికార పార్టీ నాయకులు, వారికి కొమ్ముకాసే కొందరు విశ్వవిద్యాలయ పెద్దలు లక్షలాదిమంది నిరుద్యోగుల పొట్టకొట్టారని మండిపడ్డారు.
ఒకే పరీక్ష.. 100 అనుమానాలు: కాల్వ శ్రీనివాసులు
గ్రామ సచివాలయ ఉద్యోగాల నియామకంలో ప్రభుత్వ వైఖరిపై మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు మండిపడ్డారు. ఒక్క పరీక్ష 100 సందేహలు కలిగిస్తోందన్నారు.
మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు