ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

attack on tdp leader: తెదేపా నాయకుడి​పై వైకాపా నేతల దాడి

తెదేపా నేతపై వైకాపా నేతలు దాడికి(attack) పాల్పడిన ఘటన గుంటూరు జిల్లా ఉంగుటూరు గ్రామంలో జరిగింది. ముళ్ల చెట్లు తొలగింపు పనులను పర్యవేక్షించేందుకు వెళ్లిన వ్యక్తిపై ఈ దాడికి పాల్పడ్డారు. గ్రామంలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా పికెటింగ్(piketing) ఏర్పాటు చేశారు.

తెదేపా మాజీ సర్పంచ్​పై వైకాపా నేతల దాడి
తెదేపా మాజీ సర్పంచ్​పై వైకాపా నేతల దాడి

By

Published : Jun 14, 2021, 10:11 PM IST

గుంటూరు జిల్లా అమరావతి మండలంలోని ఉంగుటూరు చెరుపు కట్టపై తెదేపా నేత, మాజీ సర్పంచ్ మేదరమెట్ల సోమశేఖర్... భారీగా మొక్కలు నాటాడు. ఇటీవల కాలంలో మొక్కల వద్ద ముళ్ల చెట్లు పెరిగిపోయింది. ఈ అంశంపై సోమశేఖర్ భార్య, ప్రస్తుత సర్పంచి మేదరమెట్ల అనురాధా... పంచాయతీ సమావేశం నిర్వహించారు. కంప చెట్లను తొలగించాలని తీర్మానించి లక్ష రూపాయల నిధులను కేటాయించారు.

తెదేపా మాజీ సర్పంచ్​పై వైకాపా నేతల దాడి

ఈ క్రమంలో సోమవారం ముళ్ల చెట్లను తొలగించే పనులు ప్రారంభించారు. పనులను పర్యవేక్షించేందుకు మాజీ సర్పంచి సోమశేఖర్ వెళ్లగా... అదే గ్రామానికి చెందిన వైకాపా నేతలు రాయపాటి శివ, ధర్మేంద్రలు ఇక్కడకు ఎందుకు వచ్చావు అంటూ సోమశేఖర్​తో వాగ్వాదానికి దిగి, దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై బాధితుడు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సోమశేఖర్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గ్రామంలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా పికెటింగ్ ఏర్పాటు చేశారు.

ఇదీచదవండి.

cheating :చిట్టీల పేరుతో మోసం... పరారయ్యేందుకు యత్నించిన వ్యక్తిని అడ్డుకున్న బాధితులు

ABOUT THE AUTHOR

...view details