గుంటూరు జిల్లా దాచేపల్లిలో అల్లుడి పై.. మామ గొడ్డలితో దాడి చేశాడు. ఈ ఘటనలో అల్లుడికి తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. దాచేపల్లికి చెందిన శ్రీరాం బోంతయ్యకు ఏడుగురు సంతానం. ముగ్గురు మగపిల్లలు, నలుగులు ఆడపిల్లలు. అయితే మెుదటి కుమారుడి.. కొడుక్కి, మూడవ కుమార్తె బిడ్డకు పెళ్లి చేసే విషయంలో ఘర్షణ జరిగింది. పెళ్లికి అల్లుడు జయసుందరం ఒప్పుకోకపోవటంతో మామ.. అల్లుడిపై గొడ్డలితో దాడి చేశాడు. ఈ ఘటనలో జయసుందరానికి తీవ్రగాయాలయ్యాయి. ఘటన స్థలానికి చేరుకున్న ఎస్సై బాల నాగిరెడ్డి విచారణ చేపట్టారు.
అల్లుడిపై గొడ్డలితో దాడి చేసిన మామ - దాచేపల్లిలో అల్లుడిపై మామ దాడి
గుంటూరు జిల్లా దాచేపల్లిలో దారుణం జరిగింది. అల్లుడిపై.. మామా గొడ్డలితో దాడి చేశాడు. ఘటన స్థలానికి చేరుకున్న ఎస్సై బాలనాగిరెడ్డి విచారణ చేపట్టారు.

వివరాలు సేకరిస్తున్న పోలీసులు