ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బెయిల్​పై విడుదలైన ఉద్దండరాయునిపాలెం రైతు

రైతు బత్తుల పూర్ణచంద్రరావు బెయిల్​పై విడుదలయ్యారు. ఎంపీ ఇంటిముందు అలజడి చేశాడని ఆయన ఇటీవల అరెస్టయ్యారు. విడుదలయిన అనంతరం ఐకాస నేతలతో కలిసి అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. అక్రమార్కుల నుంచి రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని నినాదాలు చేశారు

uddandarayunipalem farmer release from jail
బెయిల్​పై విడుదలైన ఉద్దండరాయునిపాలెం రైతు

By

Published : Oct 31, 2020, 9:44 PM IST

ఎంపీ ఇంటి ముందు అలజడి చేశాడన్న నెపంతో అరెస్టయిన ఉద్దండరాయునిపాలెంకు చెందిన రైతు బత్తుల పూర్ణచంద్రరావు బెయిల్ మీద విడుదల అయ్యారు. అనంతరం ఆయన.. ఐకాస నేతలతో కలిసి గుంటూరు లాడ్జి సెంటర్​లోని అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. అక్రమార్కుల నుంచి రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని నినాదాలు చేశారు. తమపై అక్రమ కేసు పెట్టి అన్యాయంగా అరెస్ట్ చేశారని రైతు ఆరోపించారు.

ఒక ఎంపీ రైతుల పైన కేసులు పెట్టి తన భవిష్యత్తుకి తానే సమాధి కట్టుకుంటున్నారని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు అన్నారు. అరెస్టులకు భయపడబోమని అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించే వరకూ ఉద్యమం ఆగదని యువజన జేఏసీ కన్వీనర్ రావిపాటి సాయి కృష్ణ స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: రేపు రాజధాని గ్రామాల్లో సంపూర్ణ బంద్‌: అమరావతి ఐకాస

ABOUT THE AUTHOR

...view details