అమ్మ పొత్తిళ్లలో హాయిగా ఆడుకోవాల్సిన పసికందు కాలువలో విగతజీవుడై పడి ఉంది. గుంటూరు జిల్లాలోని నరసరావుపేట జరిగిన ఈ ఘటన అందర్నీ కంటతడి పెట్టిస్తోంది. పల్నాడు రోడ్డు చెక్ పోస్ట్ వీధి కాలువలో నెలలు నిండని పసికందు మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. బొడ్డు కూడా ఊడని పరిస్థితిలో ఉన్న బాలుణ్నిపరిశీలించి దర్యాప్తు చేపట్టారు. కాలువలో నీటి ప్రవాహం వేగంగా ఉండడంతో వేకువ జామున గుర్తు తెలియని వ్యక్తులు పసికందు మృతదేహాన్ని కాలువలో పడేసి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.
అమ్మా..నన్నెందుకు కన్నావ్...? - గుంటూరు జిల్లా
బొడ్డు కూడా ఊడలేదు... అప్పుడే అమ్మకు భారమైపోయాడో ఏమో... వదిలించుకోవాలనుకుంది. కాలువలో పడేసింది. అప్పుడప్పుడే స్వయంగా ఊపిరి తీసుకుంటున్న ఆ బాలుడు... నీటి ప్రవాహానికి తట్టుకోలేకపోయాడు. చనిపోయాడు. విగతజీవుడై పడి ఉన్న ఆ పసివాడి మృతదేహం చూసినోళ్లంతా కంటతడి పెట్టారు.

కాలువలో పసికందు మృతదేహం లభ్యం
Last Updated : Aug 30, 2019, 11:33 AM IST