గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం శ్రీరామ్ నగర్ ఇసుక దిబ్బల వద్ద స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంటు బ్యూరో అధికారులు.. పెద్దఎత్తున తెలంగాణ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. లారీలో అక్రమంగా తరలిస్తున్న సూమారు రూ.8 లక్షల విలువైన మద్యం బాటిళ్లను పట్టుకున్నారు. మొత్తంగా 8 మందిని అరెస్టు చేశారు. మరో ఐదుగురి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
గ్రామీణ ఎస్పీ విశాల్ గున్ని, ఎస్ఈబీ ఏఎస్పీ ఆరిఫ్ హఫీజ్, ఏసీ శ్రీనివాస్ కేసు వివరాలను వెల్లడించారు. జిల్లాలో అక్రమ మద్యం రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నట్లు ఎస్పీ విశాల్ గున్ని చెప్పారు. అక్రమ రవాణాదారులకు వాహనాలు సమకూర్చినవారిపైనా కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.