TDP leaders sensational comments on CM Jagan and YCP ministers: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై, ఆ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలపై టీడీపీ నాయకులు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో నేరాలు, దోపిడీలకు పాల్పడుతూ.. వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచుకుంటున్న ఈ జగన్ లాంటి వ్యక్తి సీఎంగా అవసరమా..? అంటూ సీఎం జగన్ నేర చరిత్రపై సుదీర్ఘంగా మట్లాడారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులైనా.. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కాలవ శ్రీనివాసులు, నిమ్మల రామానాయుడులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
జగనాసుర చరిత్రపై టీడీపీ ఫైర్..నేరాలు, దోపిడీలతో వేలకోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచుకున్న జగన్ లాంటి వ్యక్తి సీఎంగా అవసరమా అనే విషయం ప్రజలు అలోచించుకోవాలని కోరారు. తాడేపల్లి ఫైల్స్ అనే పేరుతో సినిమా తీసినా నేరచరిత్ర సరిపోదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్‌ను పొగడడానికి క్రిమినల్ బ్యాక్ గ్రౌండ్ తప్ప మరేం లేదని మండిపడ్డారు. ఇళ్ల స్థలాల కొనుగోళ్లల్లో పేదలకు కలిగిన లాభం గోరంత.. వైఎస్సార్ కాంగ్రెస్ నేతలకు లాభం కొండంత అని ఆక్షేపించారు. జగన్‌ను ఇలా వదిలేస్తే ఇంటింటికి మద్యం కుళాయి పెట్టేస్తారని ఎద్దేవా చేశారు.
జగన్ ఎప్పుడు సింగిలే.. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ.. ''జగన్ రెడ్డి పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో సర్వ నాశనమైంది. మొత్తం క్రైమ్, కరప్షన్స్.. అన్నపూర్ణలాంటి ఆంధ్రప్రదేశ్.. దరిద్రంగా తయారైంది. జగన్‌పై 31 కేసులు ఉన్నాయి.. అలాంటి వ్యక్తి 30 ఏళ్లు పాలిస్తాడట. ఈరోజు జగన్‌ను.. ఆయన తల్లి వదిలేసింది, చెల్లి వదిలేసింది, మరో చిన్నాన్న చెల్లి వదిలేసింది. మరికొన్ని రోజుల్లో తమ్ముడు జైలుకు వెళ్లబోతున్నాడు. ఎప్పుడు మీటింగ్ పెట్టినా సింగిల్‌గా రండి అంటాడు.. ఇప్పుడు ఆయనే సింగిలైపోయాడు. తాడేపల్లి ఫైల్స్ అనే పేరుతో సినిమా తీస్తే.. ఐదారు సీక్వెల్స్ తీయాల్సి వస్తుంది'' అని ఆయన అన్నారు.