రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతుంటే వాటిని కట్టడి చేయాల్సిన ప్రభుత్వం కక్ష రాజకీయాలు చేస్తోందని తెలుగుదేశం పార్టీ నేతలు విమర్శించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో కోవిడ్ కేసులు పెరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని తెదేపా నేతలు చెప్పారు. ప్రభుత్వం, అధికారులు, శాసనసభ్యులు ప్రజలకు అవగాహన కల్పించడంలో ఘోరంగా విఫలమయ్యారని ఆ పార్టీ సీనియర్ నేత పోతినేని శ్రీనివాసరావు ఆరోపించారు. కరోనా సోకిన వ్యక్తి ఫోన్ చేసిన అరగంటలో బెడ్ సిద్ధం చేస్తామన్న సీఎం వ్యాఖ్యలు అమలుకు నోచుకోవడం లేదన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా కట్టుదిట్టమైన చర్యలు తీసుకొని ప్రజలకు మంచి వైద్యం అందించాలని కోరారు.
సీఎం వ్యాఖ్యలు అమలుకు నోచుకోవడం లేదు: తెదేపా - corona virus effect on mangalagiri
మంగళగిరిలో కరోనా కేసులు పెరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని తెదేపా నేతలు ఆరోపించారు. కోవిడ్ సోకిన వ్యక్తులు కాల్ చేసిన వెంటనే బెడ్ ఏర్పాట్లు చేస్తామన్న ముఖ్యమంత్రి వ్యాఖ్యలకు చేతలకు పొంతన లేదని విమర్శించారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి వైరస్ ప్రబలకుండా తగు చర్యలు తీసుకోవాలని కోరారు. రోగులకు మంచి వైద్యం అందించాలని డిామాండ్ చేశారు.

ప్రభుత్వంపై మంగళగిరిలో తెదేపా నేతలు మండిపాటు
ఇవీ చదవండి