ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎమ్మెల్యే కాన్వాయ్​ను అడ్డుకున్న విద్యార్థులు... ఎందుకంటే..! - students agitation for fees reimbursement in narasaraopeta news

ఫీజు రీయింబర్స్​మెంట్​ బకాయిలు చెల్లించాలని నరసరావుపేటలో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వం తక్షణమే బకాయిలు చెల్లించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని వారు హెచ్చరించారు.

students agitation for fees reimbursement in narasaraopeta
ఫీజు రీయెంబర్స్​మెంట్ బకాయిల చెల్లించాలని విద్యార్ధుల ర్యాలీ

By

Published : Dec 28, 2019, 10:34 PM IST

ఫీజు రీయింబర్స్​మెంట్ బకాయిలు చెల్లించాలని విద్యార్ధుల ర్యాలీ
ఫీజు రీయింబర్స్​మెంట్​ బకాయిలు వెంటనే చెల్లించాలని గుంటూరు జిల్లా నరసరావుపేటలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఏఎస్​ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు భారీ ఎత్తున పాల్గొన్నారు. ప్రధాన రహదారిపై ర్యాలీ నిర్వహిస్తుండగా ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కాన్వాయ్​ రావటంతో ఎమ్మెల్యేను అడ్డగించి స్కాలర్​షిప్​ బకాయిలను చెల్లించాలని వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయానికి ర్యాలీగా వెళ్లి ఆర్డీఓకు వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వం తక్షణమే బకాయిలు చెల్లించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని వారు హెచ్చరించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details