ఆకట్టుకున్న రాష్ట్రస్థాయి నాటిక పోటీలు - state level
గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలంలో వరగానిలో రాష్ట్ర స్థాయి నాటిక పోటీలు జరిగాయి. ఆతిథ్యం నాటిక మొదటి బహుమతి గెలుచుకుంది.

రాష్ట్రస్థాయి నాటిక పోటీలు
లావు వెంకటేశ్వర రావు, కల్లూరి నాగేశ్వర రావు కళాపరిషత్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి నాటిక పోటీలు నిర్వహించారు. గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం వరగానిలో జరిగిన ఈ పోటీలు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. నేటి సమాజంలో జరుగుతున్న వాస్తవాలను దృశ్యరూపంలో కళ్లకు కట్టినట్లు చూపారు. ఈ పోటీలో ప్రపంచీకరణ పేరుతో తల్లిదండ్రుల బాగోగులను పట్టించుకోకుండా విదేశాలకు పిల్లలు వెళితే ఆ వృద్ధులు పడే ఇబ్బందులను చూపిన ఆతిథ్యం నాటిక మొదటి బహుమతి గెలుచుకుంది.
అలరించిన రాష్ట్రస్థాయి నాటిక పోటీలు