పాల డెయిరీలను గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని గుంటూరు జిల్లా పొన్నూరు ఎమ్మెల్యే కిలారి వెంకటరోశయ్య విమర్శించారు. సంగం డెయిరీని ధూళిపాళ్ల నరేంద్ర హస్తగతం చేశారన్నారు. ఆ డెయిరీ లాభాలను ఎవరికి పంచారో వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు.
పాడిపరిశ్రమను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. డెయిరీలలో అమూల్ ప్రపంచంలోనే ఎనిమిదో స్థానంలో ఉందన్నారు. త్వరలో మహిళా సహకార సంఘాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.