సమావేశంలో మాట్లాడుతున్న ప్తయ్యావుల కేశవ్ కేంద్రంలోని పెద్దల మద్దతుతోనే రాజధాని మార్చుతున్ననట్లు అర్థమవుతోందన్నారు పయ్యావుల. హైకోర్టు మార్పు కేంద్రానికి సంబంధించిందని... రాష్ట్ర ప్రకటనను కేంద్రం ఎందుకు ఖండించలేదని ప్రశ్నించారు. అమరావతి విషయంలోనూ కేంద్రం వైఖరి అలాగే ఉందన్నారు. కేంద్రం పెద్దన్న పాత్రలో ఉండి సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు. వైకాపా నిర్ణయం ఏ విధంగా ప్రభావం చూపుతుందే స్థానిక ఎన్నికల్లో తేలుతుందని అభిప్రాయపడ్డారు. ప్రజల తరఫున పోరాటంలో చంద్రబాబే ముందున్నారని... భాజపా వైఖరిని జనం గమనిస్తున్నారన్నారు. రాష్ట్ర విభజన, ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం వైఖరి ఏంటో అందరికీ తెలిసిందేనని ఎద్దేవా చేశారు. అమరావతి విషయంలో కేంద్రం వైఖరిపై స్పష్టత రావల్సి ఉందన్నారు. సంబంధం, అధికారం లేని అనేక విషయాల్లో ఎన్డీఏ ప్రభుత్వం కల్పించుకుందని... కర్ణాటక, తమిళనాడులో ఈ విషయం రుజువైందని గుర్తు చేశారు. ఏపీ రాజధాని విషయంలో ఎందుకు స్పందించలేదని పయ్యావుల ప్రశ్నించారు. అమరావతిపై చంద్రబాబు ఒక్కరే నిర్ణయం తీసుకోలేదని... కేంద్రం ఏర్పాటు చేసిన శివరామకృష్ణన్ కమిటీ అధ్యయనం చేసిందని గుర్తు చేశారు.
జనసేన-భాజపా కలయిక అంతిమంగా రాష్ట్రానికి మేలు జరగాలని ప్రజలు ఆశిస్తున్నారన్న పయ్యావుల అన్నారు. ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న సమస్యలకు భాజపా పరిష్కారం చూపుతూ వచ్చిందని గుర్తుచేసిన పయ్యావుల కేశవ్...కేంద్రం తలచుకుంటే రాజధాని అమరావతి అనేది వారికి చిన్న సమస్యేనని తెలిపారు. అమరావతిపై భాజపా నిర్ణయం బట్టి ఆంధ్రప్రదేశ్లో వారి రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందన్నారు.