ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భూముల చదునుపై నిడమర్రు వాసుల ఆగ్రహం

రాజధాని ప్రాంతం నిడమర్రులో పోలీస్ పహారా నడుమ భూమి చదును కార్యక్రమాన్ని సీఎం కార్యాలయ ప్రధాన కార్యదర్శి పర్యవేక్షించారు. స్థానికుల నుంచి వ్యతిరేకత రావడం వల్ల ఆ ప్రాంతంలో భారీ భద్రతను మోహరించి.. పని పూర్తి చేశారు.

Nidamaru residents are outraged over flattening of land
భూముల చదునుపై నిడమర్రు వాసుల తీవ్ర ఆగ్రహం

By

Published : Mar 4, 2020, 11:35 PM IST

భూముల చదునుపై నిడమర్రు వాసుల తీవ్ర ఆగ్రహం

గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నిడమర్రులో భూముల చదును కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కార్యాలయ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్ పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో సీఆర్​డీఏ అధికారులూ పాల్గొన్నారు. రాజధాని కోసం ఇచ్చిన భూమిని పేదలకు పంచడం ఏంటంటూ స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ప్రాంతంలో అధికారులు భారీగా పోలీసులను మోహరించారు. రైతులను, మీడియాను, ఇతరులను ఆ ప్రాంతానికి రానీయకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అనంతరం పోలీసుల పహారాలో భూమి చదును కార్యక్రమాన్ని కొనసాగించారు.

ABOUT THE AUTHOR

...view details