TDP Leader Nara Lokesh News: గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలోని దుగ్గిరాల మండలం ఈమని గ్రామంలో తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పర్యటించారు. ఈ సందర్భంగా.. గ్రామస్థులు తమ సమస్యలను విన్నవించుకున్నారు. విద్యుత్ కోతలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు.
మంగళగిరిలో చరిత్ర తిరగరాస్తాం.. తెదేపా జెండా ఎగరేస్తాం: లోకేశ్ - Lokesh on Mangalagirir MLA
Lokesh on Mangalagiri MLA: మంగళగిరిలో చరిత్ర తిరగరాస్తాం.. తెదేపా జెండా ఎగరేస్తామని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ధీమా వ్యక్తం చేశారు. మంగళగిరి పౌరుషం ఏంటో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి చూపిస్తామన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో పర్యటన సందర్బంగా లోకేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా.. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిపై లోకేశ్ తీవ్ర విమర్శలు చేశారు. "ఎన్నికల సమయంలో ఇచ్చిన ఒక్క హామీని కూడా ఎమ్మెల్యే నిలబెట్టుకోవడం లేదు. కేసులతో వేధిస్తున్న ఎమ్మెల్యే మూల్యం చెల్లించుకోక తప్పదు. మంగళగిరి పౌరుషం ఏంటో ఎమ్మెల్యేకు చూపిస్తాం. మంగళగిరిలో చరిత్ర తిరగరాస్తాం.. తెదేపా జెండా ఎగరేస్తాం. పార్టీ కార్యకర్తల భూములను వైకాపా నేతలు కొట్టేస్తున్నారు. అ.ని.శా. యాప్ తీసుకొస్తే జగన్‌పై నేనే మొదటి ఫిర్యాదు చేస్తా. ప్రతిపక్షాల్ని వేధించడానికి ఏసీబీని వినియోగించారు. బియ్యం పంపిణీ కార్యక్రమం ఎత్తేసే కుట్ర జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ సరఫరాలో కుంభకోణానికి పాల్పడుతుంది. బహిరంగ మార్కెట్‌లో యూనిట్ విద్యుత్ రూ.20 పెట్టి కొంటున్నారు. విద్యుత్ కొనుగోళ్ల పేరుతో రూ.వెయ్యి కోట్లు కొట్టేస్తున్నారు. సీఎం కాన్వాయ్ కోసం తిరుమల వెళ్తున్న కుటుంబాన్ని బెదిరించి కారు తీసుకెళ్లారు. బిహార్‌లో ఇలా జరిగేవని విన్నాం.. ఇప్పుడు ఏపీలో చూస్తున్నాం" అంటూ.. లోకేశ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఇదీ చదవండి: ఆ ఘటనపై సీఎం జగన్ స్పందించకపోవటంలో అర్థమేంటి?: వర్ల రామయ్య