గుంటూరులోని పలు కాలనీల్లో మున్సిపల్ కమిషనర్ చల్లా అనురాధ పర్యాటించారు. కె.వి.పి.కాలనీ, కృష్ణ బాబు కాలని, సాయి నగర్ తదితర ప్రాంతాల్లో అభివృద్ది పనులు, పారిశుధ్యం పనులను తనిఖీ చేసి అధికార్లకు తగు ఆదేశాలు జారీ చేశారు. కృష్ణ బాబు కాలనిలో నూతనంగా నిర్మించిన మురుగు కాలువలు లెవల్స్ లేకుండా ఉండటం, మురుగు పారుదల లేకుండా నిలిచి ఉండటం గమనించి సదరు కాంట్రాక్టర్ ని బ్లాక్ లిస్ట్ లో పెట్టాలన్నారు.
గుంటూరులోని పలు కాలనీల్లో పర్యటించిన మున్సిపల్ కమిషనర్
నూతనంగా నిర్మించే కాలువల్లో మురుగు పారుదల సక్రమంగా ఉంటేనే బిల్లులు చెల్లింపు చేస్తామని గుంటూరు మున్సిపల్ కమిషనర్ చల్లా అనురాధ స్పష్టం చేశారు. నగరంలోని పలు కాలనీల్లో జరుగుతున్న పనులను కమిషనర్ తనిఖీ చేశారు.
అధికారులకు సూచనలిస్తున్న మున్సిపల్ కమిషనర్
నిర్మాణంలో పర్యవేక్షణ లోపం చూపిన ఏఈ, డీఈఈ కు మెమోలు ఇవ్వాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. కాలువల్లో సిల్ట్ ని గ్యాంగ్ వర్క్ తో వెంటనే తొలగించాలని, సదరు ప్రాంతాల్లో పారిశుధ్య పనులు సక్రమంగా లేకుండటం, ప్రజల నుంచి అందిన ఫిర్యాదు మేరకు శానిటరీ సూపర్వైజర్ ని విధుల నుంచి నిలిపివేయాలని శానిటరీ ఇన్స్పెక్టర్ ని ఆదేశించారు.
ఇదీ చదవండి