ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వరవరరావును విడుదల చేయించాలి: ఉపరాష్ట్రపతికి భూమన లేఖ - undefined

విప్లవ రచయిత వరవరరావును విడుదల చేయించాలని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు.. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి లేఖ రాశారు. వృద్ధాప్యం, అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన విషయంలో.. పెద్ద మనసు చేసుకోవాలని కోరారు.

mla bhumana karunakar reddy
ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి

By

Published : Jul 18, 2020, 9:04 PM IST

వృద్ధాప్యం, అనారోగ్యంతో బాధపడుతున్న విప్లవ రచయిత వరవరరావును.. తక్షణమే విడుదల చేయించాలని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి లేఖ రాశారు. వరవరరావును మానవతా దృక్పథంతో విడుదల చేయాలని భూమన కోరారు.

53 సంవత్సరాలుగా అడవుల్లో సాయుధులు సాధించలేనిది... మంచం పట్టిన విప్లవ వీరుడు సాధించలేడంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అనారోగ్యంతో అడుగులు తడబడుతున్న సిద్ధాంత నిబద్ధ వృద్దుడిని పెద్ద మనసుతో విడిచిపెట్టాలని ఉప రాష్ట్రపతిని భూమన కోరారు. ఈ మేరకు సాహిత్యపరంగా తమ మధ్య ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

ఇదీ చదవండి:

గవర్నర్​ వద్దకు ఆ 2 బిల్లులు.. తిరుగుతున్నాయి ఎన్నో మలుపులు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details