అగ్రవర్ణాల పేదల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ఇప్పటికేఅన్ని కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి...రుణాలు కేటాయించామని చెప్పారు. లోటు బడ్జెట్లో ఉన్నా..అధిక మొత్తం సంక్షేమ పథకాలకే అందించామని మంత్రి స్పష్టం చేశారు. అదే మిగులు బడ్జెట్ ఉంటే మరిన్ని పథకాలు ప్రవేశపెడతామన్నారు. సంక్షేమం కావాలంటే మళ్లీ తెదేపానే గెలిపించాలన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కుంచనపల్లి, పాతూరులో లోకేశ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ తిరిగి ఓట్లు అడిగారు.
'సంక్షేమం కావాలంటే తెదేపాను గెలిపించండి' - మంత్రి నారా లోకేష్
గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలో మంత్రి లోకేశ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మళ్లీ తెలుగుదేశాన్నే గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.

తాడేపల్లిలో మంత్రి లోకేష్ ఎన్నికల ప్రచారం