ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నాట్కో కాన్సర్ సెంటర్​లో.. అందుబాటులోకి మెడికల్ లీనియర్ యాక్సిలరేటర్

గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాలలోని నాట్కో కాన్సర్ సెంటర్​లో మరో అత్యాధునిక వైద్య పరికరణాన్ని అందుబాటులోకి తెచ్చారు. కాన్సర్ రోగులకు చికిత్స అందించడంలో కీలకమైన మెడికల్ లీనియర్ యాక్సిలరేటర్(ఎల్ఐఎన్ఏసీ) వైద్యపరికరాన్ని ఎమ్మెల్యే మహ్మద్ ముస్తఫా, నాట్కో వైస్ ఛైర్మన్ సదా శివరావు, జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ ప్రారంభించారు.

Natco Cancer Center
నాట్కో కాన్సర్ సెంటర్​లో అందుబాటులోకి మెడికల్ లీనియర్ యాక్సిలరేటర్

By

Published : Nov 3, 2020, 6:52 PM IST

పేదప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా పేర్కొన్నారు. అందులో భాగంగానే గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాలలోని నాట్కో కాన్సర్ సెంటర్​లో మరో అధునాతన వైద్య పరికరాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. కాన్సర్ రోగులకు చికిత్స అందించడంలో కీలకమైన మెడికల్ లీనియర్ యాక్సిలరేటర్ (ఎల్ఐఎన్ఏసీ)ను నాట్కో వైస్ ఛైర్మన్ సదా శివరావు, జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్​తో కలిసి ఎమ్మెల్యే మహ్మద్ ముస్తఫా ప్రారంభించారు. రాష్టంలో ఎక్కడలేని విధంగా అత్యాధునిక వైద్యపరికరాలతో నాట్కో కాన్సర్ సెంటర్​ను ఏర్పాటు చేశామన్నారు.

అక్కడ చికిత్స పొందే రోగులకు ఉచితంగా మందులు అందిస్తామని నాట్కో కార్పొరేట్‌ వ్యవహారాల జనరల్‌ మేనేజర్‌ సదాశివరావు తెలిపారు. అందుకు సంబంధించిన పత్రాలను జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్​కు ఆయన అందజేశారు. కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా ఈ కాన్సర్ ఆసుపత్రిని ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామని జిల్లా కలెక్టర్ శ్యామూల్ ఆనంద్ అన్నారు. కాన్సర్ రోగులకు ఉచితంగా మందులు ఇవ్వడానికి ముందుకు వచ్చిన నాట్కో సంస్థకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రభావతి, డాక్టర్ రాజు నాయుడు, పలువురు వైద్యులు పాల్గొన్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details