ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'బాబ్లీ కేసుతో ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు' - ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ]

ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆంధ్రప్రదేశ్ వైపు కన్నెత్తి చూడరు.. మరి కేసీఆర్​కు ఇక్కడ ఏం పని అని మంత్రి నారా లోకేశ్​ ప్రశ్నించారు.

గుంటూరు జిల్లాలో మంత్రి నారా లోకేష్ ఎన్నికల ప్రచారం

By

Published : Mar 25, 2019, 11:53 PM IST

గుంటూరు జిల్లాలో మంత్రి నారా లోకేష్ ఎన్నికల ప్రచారం
వైకాపా నేతలకు అభివృద్ధి మాటలు వినబడవు, కనబడవు...వాటిపైన వాళ్లుమాట్లాడరని ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్​ ఎద్దేవా చేశారు. ఏపీ పక్కనున్న తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల ముఖ్యమంత్రులు మనవైపు అసలు చూడరని.....మరి కేసీఆర్ కుఇక్కడ ఏం పని అని నారా లోకేష్ ప్రశ్నించారు. ప్రధాని మోదీ ప్రత్యేక హోదా ఇవ్వాల్సింది పోయి ఎప్పుడో జరిగిన బాబ్లీ కేసు తీసుకువచ్చి... ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని చెప్పారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నిడమర్రులో లోకేశ్​ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రజలతో మమేకమై సరదాగా కలియ తిరిగారు. తనను అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. గెలిచిన 30 రోజుల్లో గ్రామంలో సిమెంట్ రోడ్లు, సంవత్సరంలో అన్ని సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

ఇవీచూడండి...

ABOUT THE AUTHOR

...view details