ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాష్ట్ర ​ప్రభుత్వానికి నారా లోకేశ్ బహిరంగ సవాల్ - latest news of lokesh

అధికారంలోకి వచ్చిన 7 నెలల నుంచి జగన్​ తొవ్వుతున్నది అవినీతిని కాదు... వైకాపా ప్రభుత్వాన్ని పూడ్చిపెట్టడానికి గొయ్యి అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. అమరావతిపై జగన్​ చేసిన ఆరోపణలను లోకేశ్ తప్పుపట్టారు. రాజధాని ప్రాంతంలో 1170 ఎకరాలకు రిజిస్ట్రేషన్లు జరిగాయని తెలిపారు. ఉపసంఘం నివేదికపై ప్రభుత్వానికి లోకేశ్ బహిరంగ సవాల్ విసిరారు. 7నెలల కాలంలో విశాఖ, విజయనగరం జిల్లాల్లో జరిగిన ఇన్​సైడర్ ట్రేడింగ్​పై న్యాయపరమైన విచారణకు సీఎం జగన్ ​సిద్ధమా అంటూ... ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు.

lokesh challenge on state government
రాష్ట్ర ​ప్రభుత్వానికి లోకేష్ బహిరంగ సవాల్

By

Published : Dec 28, 2019, 3:03 PM IST

.

ట్విట్టర్​లో ఛాలెంజ్ చేసిన లోకేశ్
వైకాపా పై లోకేశ్ ట్వీట్

ABOUT THE AUTHOR

...view details