ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'పేదరికం లేని సమాజం నిర్మిస్తాం' - మంత్రి నారా లోకేష్

గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం వడ్డేశ్వరంలో పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు మంత్రి నారా లోకేశ్‌ హాజరయ్యారు. వచ్చే ఐదేళ్లలో పేదరికం లేని సమాజాన్ని నిర్మిస్తామని ఆయన తెలిపారు.

మంత్రి నారా లోకేష్

By

Published : May 21, 2019, 7:53 AM IST

వచ్చే ఐదేళ్లలో పేదరికం లేని సమాజాన్ని నిర్మిస్తామని ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ చెప్పారు. అల్లా దయతో మరో 2 రోజుల్లో తెలుగుదేశం తిరిగి అధికారంలోకి రాబోతోందని విశ్వాసం వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం వడ్డేశ్వరంలో పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు లోకేశ్‌ హాజరయ్యారు. ప్రత్యేక పార్థనలు నిర్వహించారు. ఇఫ్తార్ విందు సందర్భంగా ...లవకుశ సినిమాలో ఆ పాత్రలు పోషించిన కుశుడు, నాగరాజులను మంత్రి లోకేశ్‌ ఘనంగా సత్కరించారు. మహిళలకు చీరలు పంపిణీ చేశారు. మండుటెండలను లెక్క చేయకుండా కఠిన ఉపవాస దీక్షలు చేపట్టిన ముస్లిం సోదరులకు అల్లా శక్తినివ్వాలని ఆకాంక్షించారు.

ఇఫ్తార్‌ విందులో పాల్గొన్న మంత్రి నారా లోకేశ్‌

ABOUT THE AUTHOR

...view details