గుంటూరు జిల్లాలో కరోనా కేసుల ఉద్ధృతి కొనసాగుతోంది. ఇవాళ కొత్తగా 387 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలుపుకుని జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 68,761కు చేరాయి. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా గుంటూరు నగరం పరిధిలో 104 కేసులు నమోదయ్యాయి. బాపట్ల 29, రేపల్లె 28, పొన్నూరు 23, మంగళగిరి 18, తెనాలి 15, పెదకాకాని 12, నరసరావుపేట 11, సత్తెనపల్లి 11, పిడుగురాళ్లలో 10 కేసుల చొప్పున నమోదయ్యాయి.
జిల్లాలో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకుని 63,565 మంది ఇంటికి చేరుకున్నారు. వైరస్ ప్రభావంతో జిల్లాలో నేడు ముగ్గురు మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 621కి చేరింది. రాష్ట్రంలో కరోనా కారణంగా అధిక మరణాలు నమోదవుతున్న జిల్లాల్లో గుంటూరు రెండో స్థానంలో కొనసాగుతోంది.