ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమీక్షను ప్రతిపక్షాలు విమర్శించడం సరికాదని ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ అన్నారు. ప్రభుత్వానికి ఐదేళ్లపాటు పరిపాలించే అధికారం ఉంటుందని స్పష్టంచేశారు. ఎన్నికల కోడ్ పేరుతో అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రైతుల సమస్యలు పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందనీ.. ప్రస్తుతం ఉన్నది ఎన్నికైన ప్రభుత్వమనేనని తెలిపారు. మోదీ, రాజ్‌నాథ్‌సింగ్ సమీక్షలు నిర్వహిస్తున్నారనీ.. వారికి అడ్డురాని కోడ్... ఆంధ్ర రాష్ట్రానికి ఎలా వర్తిస్తుందని ప్రశ్నించారు. రాష్ట్రంలో పాలనను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందనీ.. పాలనా వ్యవహారాలు జరక్కుండా ఈసీ జోక్యం చేసుకోకూడదని అన్నారు.
'ఎన్నికైన ప్రభుత్వానికి ఐదేళ్లు పరిపాలించే అధికారం ఉంటుంది'
రాజ్యాంగం ప్రకారం ఎన్నికైన ప్రభుత్వానికి ఐదేళ్లు పాలించే అధికారం ఉంటుందని తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ అన్నారు. సీఎం సమీక్షలను ప్రతిపక్షాలు విమర్శించడం సరికాదన్నారు.
కనకమేడల రవీంద్రకుమార్