తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గుంటూరు జిల్లా భవిష్యనిధి ఉద్యోగులు ఒకరోజు టోకెన్ సమ్మె నిర్వహించారు. స్థానిక కృష్ణానగర్‌లోని పీఎఫ్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. దశాబ్దాలుగా ఉద్యోగోన్నతులు నిలిచిపోయాయనీ.. దీనికోసం 2015లో వేసిన కమిటీ నాలుగేళ్లుగా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తంచేశారు. బీ,సీ,డీ కేటగిరీ ఉద్యోగుల ప్రమోషన్‌పై తక్షణం నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. కారుణ్య నియామకాలు, ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి బదిలీ వంటి సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.
గుంటూరులో భవిష్యనిధి ఉద్యోగుల ధర్నా - గుంటూరులో భవిష్యనిధి ఉద్యోగుల ధర్నా
తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గుంటూరు జిల్లా భవిష్యనిధి ఉద్యోగులు ఒకరోజు టోకెన్ సమ్మెకు దిగారు. బీ,సీ,డీ కేటగిరీ ఉద్యోగుల ప్రమోషన్‌పై తక్షణం నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు.

గుంటూరులో భవిష్యనిధి ఉద్యోగుల ధర్నా