విశాఖలో గ్యాస్ లీకేజీ ప్రమాదం జరిగిన ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమను మూసివేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. జనావాసాల మధ్య ఇలాంటి ప్రమాదకర పరిశ్రమలు అవసరమా అని ప్రశ్నించారు. విషవాయువు పీల్చి అస్వస్థతకు గురైన వారికి భవిష్యత్తులోనూ ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఈమేరకు పరిశ్రమ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మరోవైపు.. పెను విషాదానికి కారణమైన ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ వద్ద ఆందోళన చేస్తున్న వెంకటాపురం గ్రామస్థులను పోలీసులు అరెస్టు చేయడాన్ని ఖండించారు. అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.