Constitution Day celebrations at TDP office:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు స్వీకరించిన రోజు నుంచి.. రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నాడంటూ.. తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు ఆరోపించారు. ఎన్టీఆర్ భవన్లో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. అనంతరం అచ్చెన్న మీడియాతో మాట్లాడారు. జగన్ తనపై ఉన్న 11 సీబీఐ కేసులు విచారణలో ఉంటే, 341 సార్లు ఆ కేసులు వాయిదా కోరాడని తెలిపారు. ఒక్కరోజు కూడా న్యాయస్థానానికి వెళ్ళాకుండా మోసం చేశారని అచ్చెన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కేసుల వాయిదా వెళ్లకుండా ఉండే అవకాశం ఓక జాగన్ తప్ప సామాన్య పేదవాడికి ఎవరైనా దొరుకుతుందా అని నిలదీశారు. జగన్ తన అవినీతికి సంబంధించి కోర్టులో వేసిన నోటీసు పై వెంటనే విలేకరుల సమావేశం పెట్టి రాష్ట్ర ప్రజానీకానికి సమాధానం చెప్పాలని సవాల్ చేశారు. ఆర్టికల్ 14ను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దుర్వినియోగం చేస్తున్నాడని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి జగన్ కేసుల్లో న్యాయ సమీక్ష కావాలని డిమాండ్ చేశారు.
భారత రాజ్యాంగ దినోత్సవం - భీమ్ సేన ఆధ్వర్యంలో విశాఖ బీచ్ రోడ్‌లో భారీ ర్యాలీ
రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తున్నారు:సీఎం జగన్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ఆరోపించారు. బీఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ధిక్కరించి.. జగన్ తన తాత రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తోన్నారని ఆరోపించారు. జగన్ అనే నియంత సర్కారుకి రాజ్యాంగ దినోత్సవం జరుపుకునే హక్కు లేదని లోకేశ్ విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో రాజ్యాంగ హక్కులకి దిక్కులేదని, నిలదీస్తే నిర్బంధమని మండిపడ్డారు. సర్కారు అవినీతి, అరాచకాలని ప్రశ్నిస్తే ప్రాణాలు తీసిన జగన్ ఆటవిక పాలనని అంతమొందించేందుకు ప్రజలు ఉద్యమించాలని లోకేశ్ పిలుపునిచ్చారు. జగన్ నేర క్రూర పాలనకి బలైన వారందరికీ కన్నీటి నివాళులర్పించారు. ప్రజాస్వామ్య విలువలు కాపాడటానికి, అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తితో పని చేస్తున్న మహానుభావులు, ప్రజలకి లోకేశ్ రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు.