ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

క్షేత్రస్థాయి నుంచి కాంగ్రెస్​ను బలోపేతం చేస్తాం: మాజీ ఎంపీ జేడీ శీలం

రాష్ట్రంలో పార్టీని క్షేత్ర స్థాయి నుంచి అన్ని విధాలా బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నామని కాంగ్రెస్ నేతలు తెలిపారు. ప్రాంతీయ పార్టీలు కులాల మతాల మధ్య చిచ్చుపెట్టి ప్రజలను విభజించి పాలన చేస్తున్నాయని మాజీ ఎంపీ జేడీ శీలం మండిపడ్డారు. వైకాపా ప్రభుత్వం ప్రజలను నమ్మించి మోసగించడమే పనిగా పెట్టుకుందని విమర్శించారు.

congress press
congress press

By

Published : Jun 30, 2021, 11:06 AM IST

గుంటూరులో ఏపీ కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఇంచార్జ్ మేయ్యప్పన్, మాజీ ఎంపీ జేడీ శీలంతో సహా తదితర నేతలు పాల్గొన్నారు. పార్టీని క్షేత్ర స్థాయి నుండి అన్ని విధాలా బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నామని మాజీ ఎంపీ జేడీ శీలం అన్నారు. ప్రజలు రైతులు, కూలీలు, బడుగు బలహీన వర్గాల వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని.. వారికి సేవ చేయడానికి ముందుకు వస్తున్నామని చెప్పారు.

ప్రాంతీయ పార్టీలు కులాల మతాల మధ్య చిచ్చుపెట్టి ప్రజలను విభజించి పాలనా చేస్తున్నారని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షడు మస్తాన్ వలి అన్నారు. కాంగ్రెస్ హయాంలో వేలాదిమంది పేదలకు ఇళ్లు నిర్మించి ఇచ్చామని.. నేడు అధికారాలంలో ఉన్న వైకాపా ప్రభుత్వం ఎన్ని ఇళ్లు నిర్మించిందో చెప్పాలని డిమాండ్ చేశారు. వైకాపా ప్రభుత్వం ప్రజలను నమ్మించి మోసగించడమే పనిగా పెట్టుకుందన్నారు. కాంగ్రెస్ పార్టీని గ్రామ స్థాయి నుండి బలోపేతం చేసి.. రాబోయే ఎన్నికల్లో మెజారిటీతో అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details