తుళ్లూరు మండలం వెలగపూడిలో ఎస్సీ కులంలోని రెండు వర్గాల మధ్య రేగిన వివాదం ఘర్షణకు దారి తీసింది. గ్రామంలోని ఎస్సీ కాలనీలో సిమెంట్ రోడ్లు వేస్తున్నారు. క్రిస్మస్ స్టార్ పెట్టుకునేందుకు పిల్లర్లు వేయాలని ఓ వర్గం వారు యత్నించారు. రహదారుల నిర్మాణం జరుగుతుండటంతో.. సిమెంట్ పిల్లర్ల వల్ల ఇబ్బందులు పడతామని మరో వర్గం వారు అన్నారు. ప్రత్యామ్నయంగా పైపులు వేసుకోవాలని సూచించారు. దీంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ప్రత్యేక బలగాలతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. వారితో చర్చలు జరిపి..అందరినీ అక్కడి నుంచి వెళ్లిపోవాలని హెచ్చరించారు.
వెలగపూడిలో ఇరువర్గాల మధ్య ఘర్షణ - Clashes between two communities news
గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెలగపూడిలో ఎస్సీ కులానికి చెందిన ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గొడవ సద్దుమణిగేలా చేశారు.

రెండు వర్గాల మధ్య ఘర్షణ