గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం పమిడిపాడులో వైకాపా - జనసేన వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. గ్రామ సచివాలయంలో జరిగిన ఈ గొడవలో.. ఇరువర్గాల వారు పరస్పరం వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో తోపులాట చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో రెండువర్గాల వారికి స్వల్ప గాయాలయ్యాయి. దీనిపై రెండు పార్టీలవారు నరసరావుపేట గ్రామీణ పోలీస్ స్టేషన్లో పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. వైకాపా వర్గీయులే గొడవకు కారణమని.. జనసేన తరఫున ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని సర్పంచి గౌసియా బేగం వాపోయారు.
పమిడిపాడులో జనసేన, వైకాపా వర్గీయుల మధ్య ఘర్షణ
గుంటూరు జిల్లా పమిడిపాడులో జనసేన, వైకాపా వర్గీయులు మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో ఇరు పార్టీలకు చెందిన పలువురికి స్వల్పగాయాలయ్యాయి.
పమిడిపాడులో జనసేన, వైకాపా వర్గీయుల మధ్య ఘర్షణ