ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాజకీయ ప్రయోజనాల కోసమే.. ఈ తీర్మానాలు: సోము వీర్రాజు

SOMU VEERRAJU FIRES ON CM JAGAN OVER CHRISTIANS BILL: అఖిలపక్ష సమావేశంలో చర్చించకుండానే రాజకీయ ప్రయోజనాల కోసం దళిత క్రైస్తవులను ఎస్సీల జాబితాలో చేర్చాలని తీర్మానం చేసినట్లు కనిపిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మండిపడ్డారు. నిన్నటి అసెంబ్లీలో సీఎం జగన్​ వ్యాఖ్యలు చూస్తే మతమార్పిడిలను ప్రోత్సహించే విధంగా ఉన్నాయని పేర్కొన్నారు.

SOMU VEERRAJU FIRES
SOMU VEERRAJU FIRES

By

Published : Mar 25, 2023, 10:49 AM IST

SOMU VEERRAJU FIRES ON CM JAGAN OVER CHRISTIANS BILL : సెక్యులర్ వ్యవస్ధలో మతమార్పిడిలను ప్రోత్సహించే దిశగా రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఉందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ధ్వజమెత్తారు. అంబేడ్కర్ రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా.. రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసిందని ఆయన మండిపడ్డారు. రాజ్యాంగంలో లేని దళిత క్రైస్తవ నూతన నామకరణంపై తీర్మానం చేయడంపై రెండు ప్రాంతీయ పార్టీల వైఖరిని ప్రజలు గమనిస్తున్నారని సోము తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో దళిత క్రైస్తువులకు, షెడ్యూల్ కులాలకు ఇచ్చే రిజర్వేషన్లు వర్తింప చేసే విధంగా తీర్మానం చేసి కేంద్రానికి పంపడాన్ని తమ పార్టీ తీవ్రంగా తప్పుపడుతోందని వీర్రాజు అభిప్రాయపడ్డారు. సెక్యులర్ దేశంలో మతమార్పిడిలకు ఈ తీర్మానం ఊతమిచ్చే విధంగా ఉందని, ఇటువంటి అంశాలపై వైసీపీ కనీసం అఖిల పక్షంతో కూడా చర్చించకుండా ఏకోన్మకంగా తీర్మానం చేయడం ఇది ఆ పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసమే అన్నట్లు భావించాల్సి వస్తోందని దుయ్యబట్టారు.

షెడ్యుల్ కులాలు, తెగలకు సంబంధించి వారి ఆర్థిక స్థితిగతులు, సామాజిక స్థితిగతుల్లో మార్పులు తీసుకుని వచ్చి వారి అభివృద్ధి కోసం రిజర్వేషన్లను రాజ్యాంగ బద్దంగా కల్పిస్తే అందుకు భిన్నంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ తీర్మానం చేయడంపై బీజేపీ తీవ్రంగా విభేదిస్తోందని సోము స్పష్టం చేశారు. ఎస్సీ వర్గాలకు చెందిన కొందరు క్రైస్తవాన్ని స్వీకరిస్తే వారికి క్రైస్తవంలో కూడా వివక్షత ఉందని అందువల్ల క్రైస్తవ మతం తీసుకున్న ఎస్సీ వర్గాలకు కూడా రిజర్వేషన్ కొనసాగించాలని గతంలో 2019 ఫిబ్రవరి రెండవ తేదీన ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్న సమయంలో అసెంబ్లీ తీర్మానం చేసి భారత ప్రభుత్వానికి పంపించిందని గుర్తు చేశాకు.

కానీ తాజాగా వైసీపీ ప్రభుత్వం ఇదే అంశంపై తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించడంపై సోము వీర్రాజు మండిపడ్డారు. తన పాదయాత్రలో వచ్చిన వినతులు కారణంగా దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా పునరుద్దరించాలని అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టామని ముఖ్యమంత్రి జగన్​ ప్రకటించారని, అదే విధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​లో కూడా తీర్మానం చేసి ఆనాడు కేంద్రానికి పంపడం జరిగిందని.. ఇప్పుడు ముఖ్యమంత్రి వ్యాఖ్యలు చూస్తే మత మార్పిడిలు ప్రోత్సహించే దిశగా ఉన్నాయని ఆరోపించారు.

ఇదీ జరిగింది:అన్యాయానికి గురైన వారికి చేతనైనంత మంచి చేసే అవకాశం ఉన్నప్పుడు ఆ బాధ్యత తీసుకోవాలనే ఈ రెండు తీర్మానాలు చేశామని ముఖ్యమంత్రి జగన్​ వివరించారు. దళిత క్రైస్తవులను ఎస్సీలుగా పరిగణించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ సాంఘిక సంక్షేమ శాఖా మంత్రి మేరుగు నాగార్జున, బోయ, వాల్మీకి కులాలను ఎస్టీల జాబితాలో చేర్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ బీసీ సంక్షేమ శాఖామంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణలు.. శుక్రవారం శాసనసభలో రెండు వేర్వేరు తీర్మానాలను ప్రవేశపెట్టారు. వాటిని సభ ఏకగ్రీవంగా ఆమోదించింది

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details