అంబేడ్కర్ స్మృతివనం గుంటూరులో ఏర్పాటు కానుంది. ఆ మహనీయుని జీవిత విశేషాలను తెలిపేలా మ్యూజియం నిర్మించటంతో పాటు 100 అడుగుల ఎత్తులో అంబేడ్కర్ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. స్మృతివనం చుట్టూ పచ్చదనం ఉండేలా గ్రీనరీ పెంచుతారు. ఇందుకు సంబంధించి ప్రతిపాదనలు పంపవలసిందిగా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి జిల్లా కలెక్టరు శామ్యూల్ ఆనంద్‌కుమార్‌ను ఆదేశించారు. ఈ మేరకు కలెక్టరు గుంటూరు జాతీయ రహదారి పక్కన గల ఎన్టీఆర్ మానస సరోవరం ఉద్యాన పార్కును సందర్శించారు. 53 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఉద్యాన పార్కులో 5 ఎకరాలు స్మృతివనానికి కేటాయించాలని నగర కమిషనర్ అనూరాధ, గుంటూరు పశ్చిమ మండల తహసీల్దార్ మోహనరావును ఆదేశించారు.
యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు
గత ప్రభుత్వ హయాంలో రాజధాని అమరావతి ప్రాంతంలో అంబేడ్కర్ స్మృతి వనం ఏర్పాటుకు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేశారు. అక్కడి పనులు ముందుకు సాగడం లేదు. వైకాపా ప్రభుత్వం కొలువు దీరిన తర్వాత చిలకలూరిపేటలో ప్రభుత్వ స్థలంలో ఏర్పాటు చేయాలని భావించారు. ఈ ప్రాంతం జిల్లా కేంద్రానికి దూరంగా ఉండడంతో ఆ ప్రతిపాదనను విరమించారు. తాజాగా మానస సరోవరం పార్కును ప్రతిపాదించారు. యుద్ధ ప్రాతిపదికన స్మృతివనం ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టారు. ముఖ్యమంత్రి జగన్ స్వయంగా శంకుస్థాపన చేయనున్నట్లు సమాచారం.
పార్కును శుభ్రంగా ఉంచాలని..
ఈ ప్రాజెక్టుకు భారీగా నిధులు మంజూరు చేయనున్నట్లు సమాచారం. కేంద్ర సామాజిక న్యాయం, సాధికారిత శాఖ అంబేడ్కర్ పేరుతో నిర్మించే పార్కులకు నిధులను కేటాయిస్తుంది. దీంతో కేంద్రం నుంచి కూడా నిధులను తీసుకొచ్చి భారీగా నిర్మించాలని భావిస్తున్నారు. ఇప్పటి వరకు మానస సరోవరం పార్కులో క్రేజీ వరల్డ్ స్విమ్మింగ్ పూల్ ఉంది. ప్రైవేటు వ్యక్తి ఒప్పందం గడువు పూర్తి కావడంతో ఖాళీ చేయించాలని కలెక్టరు ఆదేశించారు. నగరవాసులు ఇక్కడ ఉల్లాసంగా గడిపేలా వాతావరణాన్ని మార్చాలని అధికారులు భావిస్తున్నారు.
గుంటూరులో అంబేడ్కర్ స్మృతివనం!
గుంటూరులో అంబేడ్కర్ స్మృతివనం ఏర్పాటు కానుంది. 100 అడుగుల ఎత్తులో అంబేడ్కర్ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ప్రాథమికంగా ప్రతిపాదించారు. అలాగే ఆ మహనీయుని జీవిత విశేషాలను తెలిపేలా మ్యూజియం నిర్మించనున్నారు.
అంబేడ్కర్ స్మృతివనం!
ఇదీచదవండి