ఎస్పీ-బీఎస్పీ కూటమిపై విరుచుకుపడిన షా ఎస్పీ-బీఎస్పీ కూటమిపై విరుచుపడ్డారు భాజపా అధినేత అమిత్‌షా. ఉత్తరప్రదేశ్ అలీగడ్‌లో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. అత్త-అల్లుడి కూటమికి భాజపా కార్యకర్తలు తాళాలు వేయనున్నారని వెల్లడించారు. అలీగడ్ తాళాల పరిశ్రమకు పేరుగాంచిన కారణంగా పైవిధంగా స్పందించారు షా. ఉత్తరప్రదేశ్‌లోని లోక్‌సభ సీట్లలో 74 స్థానాలు భాజపా ఖాతాలో పడనున్నాయని ధీమా వ్యక్తం చేశారు అమిత్‌షా.
రానున్న లోక్‌సభ ఎన్నికలు నరేంద్రమోదీ, మిగతా పార్టీల కూటమి మధ్యేనని తెలిపారు షా. ఉత్తరప్రదేశ్‌లోని రౌడీయిజం, భూ దందాల్ని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం సమర్థంగా తిప్పికొట్టగలిగిందన్నారు అమిత్.
ఉత్తరప్రదేశంలో ఏం జరుగుతోంది. అత్తాఅల్లుళ్లు ఏకమయ్యారు. నాకు యూపీ కార్యకర్తల సంగతి తెలుసు. అత్తాఅల్లుళ్లే కాదు, వారితో పాటు రాహుల్‌గాంధీ చేరినా చిత్తుగా ఓడిస్తారు. నేను కార్యకర్తలకు చెబుతున్నాను ఈ మహాకూటమి బలహీనమైంది దీనికి భయపడాల్సిన అవసరం లేదు.
-అమిత్‌షా
షా వ్యాఖ్యలకు మాయావతి ఘాటు స్పందన
బీఎస్పీ-ఎస్పీ కూటమితో భాజపా నేతలకు నిద్రపట్టటం లేదని అమిత్ షా వ్యాఖ్యలకు సమాధానమిచ్చారు మాయావతి. ప్రతి సమావేశంలో భాజపా నేతలు తమను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేయడమే అందుకు నిదర్శనమన్నారు. అలీగడ్ సభలోనూ ఇదే పునారావృతమైందని, ఇటువంటి వ్యాఖ్యలు తమ శ్రేణుల్ని ఉత్తేజపరుస్తాయని సమాధానమిచ్చారు మాయావతి.
రానున్న లోక్‌సభ ఎన్నికల్లో భాజపాకు ఎదురుదెబ్బ తగలనుందన్నారు ఆవిడ. ప్రతీ ఒక్కరికీ భాజపా రాజకీయ కక్ష సాధింపు ధోరణి అర్థమైందన్నారు. భాజపా వర్గీయులు తాము రాజ్యాంగం కంటే పెద్దవారమని భావిస్తుంటారన్నారు.