ఇదీ చదవండి :
వాగులో చిక్కుకున్న యువకుడు... రక్షించిన అగ్నిమాపకశాఖ...
గత కొన్ని రోజులుగా కురుస్తోన్న వర్షాలకు తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడులో వాగులు, వంకలు పొంగుతున్నాయి. ప్రత్తిపాడు మండలం రాచపల్లి గ్రామానికి చెందిన కొల్లు వీరబాబు అనే యువకుడు ప్రమాదవశాత్తు శుద్ధగడ్డ వాగులో పడ్డాడు. ఈత రాని కారణంగా గడ్డలో కొట్టుకుపోతూ చెట్టు కొమ్మ పట్టుకొని కాపాడాలని కేకలు పెట్టాడు. సమాచారం అందుకున్న ప్రతిపాడు అగ్నిమాపక సిబ్బంది... వీరబాబును రక్షించారు.
వాగులో చిక్కుకున్న యువకుణ్ని రక్షించిన అగ్నిమాపకశాఖ