ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పర్యాటకులతో కళకళలాడుతున్న కేంద్రపాలిత యానం - godavari

పగలంతా భానుడి భగభగలతో అల్లాడిపోతున్న ప్రజలకు గోదావరి తీరాలు ఉపశమనం కలిగిస్తున్నాయి. ఉక్కపోతలకు భయపడి ఇంటి నుంచి బయటకు రాని జనం... సాయంత్రం అయితే చాలు కాస్త చల్లగాలి ఆస్వాదించేందుకు తీరాలకు చేరిపోతున్నారు .

పర్యాటకులతో కళకళలాడుతున్న కేంద్రపాలిత యానం

By

Published : May 13, 2019, 6:57 AM IST

పర్యాటకులతో కళకళలాడుతున్న కేంద్రపాలిత యానం

పర్యాటకులతో తీర ప్రాంతాలు కిటకిటలాడుతున్నాయి. భానుడి ఎండల ప్రతాపంతో పర్యాటక ప్రాంతం పుదుచ్చేరికి రాష్ట్ర నలుమూలల నుంచి పర్యాటకులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. పర్యాటక శాఖ బోట్లలో చల్ల చల్లగా విహరిస్తున్నారు. రాజీవ్ బీచ్ సైతం సందర్శకులతో సందడిగా మారింది. గోదావరిలో ఇటీవల చోటు చేసుకున్న బోటు ప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని లైఫ్ జాకెట్లను తప్పనిసరిగా వినియోగిస్తున్నారు. నిరంతరం పోలీసుల పరిరక్షణతో పాటు జిల్లా ఎస్పీ రచన సింగ్ స్వయంగా పరిశీలిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details