తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వెలిచేరులోని లంక ప్రాంతాల్లో ఎస్ఈబీ అధికారులు సారా కేంద్రాలపై దాడులు నిర్వహించారు. వెలిచేరులోని గోదావరి ఇసుక తిన్నెల్లో నాటు సారా తయారు చేసేందుకు నిల్వ ఉంచిన 8,400 లీటర్ల బెల్లం ఊటను ఎక్సైజ్ శాఖ సిఐ ఏవి చలం ఆధ్వర్యంలో స్వాధీనం చేసుకుని ధ్వంసం చేశారు. సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేస్తామని తెలిపారు.
సారా కేంద్రాలపై ఎస్ఈబీ దాడులు..భారీగా బెల్లం ఊట ధ్వంసం - తూర్పుగోదావరి జిల్లా తాజా సమాచారం
తూర్పుగోదావరి జిల్లా వెలిచేరు లంక ప్రాంతాల్లోని సారా స్థావరాలపై ఎస్ఈబీ అధికారులు దాడులు చేసి..8వేల లీటర్లకుపైగా బెల్లంఊటను ధ్వంసం చేశారు.

SEB officers raid Sara centers