యానాంలో పుదుచ్చేరి సీఎం పర్యటన పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణస్వామి... యానాంలో పర్యటిస్తున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా యానాం చేరుకున్న నారాయణస్వామి... పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. యానాం కనకాల పేటలో రూ.21 కోట్ల వ్యయంతో నిర్మించిన ఫ్రెంచ్, అడవిపాలెం కాల్వల అనుసంధాన పథకం, యానాంలో రూ.3 కోట్ల వ్యయంతో నిర్మించిన డిగ్రీ కళాశాల నూతన భవనాన్ని ప్రారంభించారు. దెయ్యాలతిప్పలో రూ. 25 కోట్లతో అభివృద్ధి చేసిన మడ అడవుల సందర్శన కేంద్రాన్ని, గిరిపేటలో.. అత్యవసర సమయాల్లో వైద్య సదుపాయాలు అందించేందుకు అంబులెన్స్‌ను ఆయన ప్రారంభించారు. పుదుచ్చేరిలోని జిప్మర్ ఆసుపత్రికి అనుసంధానంగా యానాంలో నిర్మించే భవనానికి ఆయన భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో పుదుచ్చేరి ఆరోగ్య శాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు, యానాం డిప్యూటీ కలెక్టర్ శివరాజ్ మీనా, అధికారులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
ఇదీ చదవండి: