పోలవరం నిర్వాసితుల ఆందోళన - పోలవరం
తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం పరిధిలో పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం నిర్మిస్తున్న ఇళ్లలో కనీస నాణ్యత ప్రమాణాలు పాటించటంలేదని ఆరోపించారు. అధికారులు స్పందించిన తగిన తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

పోలవరం నిర్వాసితుల ఆందోళన
పోలవరం నిర్వాసితుల ఆందోళన
పోలవరం నిర్వాసితులు ఆందోళనకు దిగారు. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం పోలవరం నిర్వాసిత కాలనీ నిర్మాణ పనుల వద్ద నిర్వాసితులు ఆందోళనకు దిగారు. కేవలం 6 పిల్లర్లతో 2 గదులు నిర్మిస్తున్న ఇళ్ళలో ఏవిధంగా ఉండగలమని ఆవేదన వ్యక్తం చేశారు. చేపట్టిన పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించటంలేదని ఆరోపించారు. ఎవరి స్థలాలు వారికి కేటాయిస్తే తామే కట్టుకుంటామని చెబుతున్నారు.